calender_icon.png 24 February, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేవాదళ్‌కు ఘనమైన చరిత్ర

24-02-2025 12:21:13 AM

జిల్లా ఇంచార్జి వాజిద్ మహెక్

మహబూబ్ నగర్ ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి) : కాంగ్రెస్ పార్టీలో సేవాదళ్ విభాగానికి ఘనమైన చరిత్ర ఉందని ఆ సంస్థ జిల్లా ఇన్చార్జీ వాజిద్ మహెక్ అన్నారు. జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి అధ్వర్యంలో చివరి ఆదివారం సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో జెండాను ఎగురవేశారు.

జిల్లా ఇన్చార్జి వాజిద్ మహెక్ మాట్లాడుతూ కాంగ్రెస్ వాటిలో సేవాదళ్ కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. పార్టీ కార్యక్రమాలతోపాటు సేవా కార్యక్రమాల్లో సేవాదళ్ విభాగం ముందుండి పనిచేస్తుందన్నారు. జిల్లా సేవాదళ్ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి అన్వర్ పాషా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రతి వాడలో జెండా ఆవిష్కరణలు చేస్తామని అన్నారు.

హర్ గావ్, హర్ గలి సేవాదళ్ నినాదంతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ మీడియాసెల్ కన్వీనర్ సీజే బెనహర్, సేవాదళ్ నాయకులు సుభాష్ ఖత్రి, అలీ, లోక్ నాథ్, సంజీవరెడ్డి, జగదీష్, వెంకటలక్ష్మి, ఉమర్, హమీద్ మహెక్, వేణురెడ్డి, నవీన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.