calender_icon.png 15 April, 2025 | 8:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా హనుమాన్ జయంతి

13-04-2025 12:00:00 AM

వారసీగూడ ఏప్రిల్ 12 (విజయక్రాంతి) : వారాసిగూడ పరిధిలో అన్ని ఆలయాలు భక్తులతో కిట కిట లాడాయి. పెద్దఎత్తున భక్తులు హనుమంతునికి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. అనంతరం జెండాలు పట్టుకొని విధులలో ఊరేగింపుగా వెళ్ళారు. బౌద్ధ నగరలో ఉమా చంద్రమౌళి రామాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తు లు ఉదయం నుంచి అధికసంఖ్యలో పాల్గొని స్వామివారికి వడ మాలలతో పూజించారు. అనంతరం స్వామికి ఇష్టమైన ఆకు పూజ చేసి స్వామివారి కృపా కటాక్షాలు పొందారు.

ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి పూజలు

రాజేంద్రనగర్, ఏప్రిల్12: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధాం తిలో ఉన్న హనుమాన్ మందిరంలో హనుమాన్ జయంతి సందర్బంగా ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అభిషేకం, ప్రతేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం 54 అడుగుల హనుమాన్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేశారు. 

- తోకల శ్రీనివాస్‌రెడ్డి పూజలు 

బీజేపీ నియోజకవర్గం ఇంచార్జి తోకల శ్రీనివాస్ రెడ్డి మైలార్ దేవుపల్లి డివిజన్ పరిధిలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధైర్యానికి ప్రతిరూపం హనుమంతుడు అన్నారు.