calender_icon.png 11 January, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవం...

10-01-2025 11:36:00 PM

ఉత్తర ద్వారంలో భక్తులకు రామయ్య దర్శనం

రామనామ స్మరణతో మారు మ్రోగిన భద్రాద్రి...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా  దక్షిణ అయోద్యగా పేరొందిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శుక్రవారం తెల్లవారుజామున ముక్కోటి ఏకాదశి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్బంగా రామయ్య ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆ సుందర దృశ్యాన్ని తిలకించి పులకించిన అఖిలాండ  భక్తజనం జై శ్రీరామ్... జై జై శ్రీరామ్ అంటు జయ జయద్వనాలు చేశారు. ఉత్తర ద్వారం లోపల దేవాలయం అర్చకులు దట్టమైన సాంబ్రాణి పొగ మబ్బులు విడపోస్తు ఆ మబ్బు తెరల నుంచి భద్రాద్రి రామయ్య దర్శన భాగ్యం కలగటంతో ఆ సుందర దృశ్యాన్ని తిలకించిన భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు. ఈ సందర్బంగా వేదపండితులు ముక్కోటి విశిష్టతను హజరైన భక్తులకు వివరించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీవీఐపీ, వీఐపీ సేక్టార్‌లతో పాటు ఇతర సెక్టార్లలోని భక్తులు వేడుకను నేరుగా తిలకించారు. ఇతర రాష్ట్రలకు చెందిన ప్రజలు టీవీల ద్వారా వీక్షించారు. స్థానాచార్యులు భక్తులకు ముక్కోటి ఏకాదశి విశిష్టతను వివరించగా, అర్చకులు 108 ఒత్తులతో వెలిగించిన హారతిని భక్తులు అందుకొన్నారు. 

మాడ వీదుల్లో స్వామి వారి ఊరేగింపు:

ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇచ్చిన తర్వాత ఉత్సవ మూర్తులను మాడ వీదుల్లో ఊరేగించారు. భక్తులకు  ఎలాంటి అసౌకర్యం కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఏర్పాట్లు చేయించారు. ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రతి సెక్టార్‌లో ఏర్పాట్లు పర్యవేక్షణకు జిల్లా స్థాయి అధికారులను నియమించారు. బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ రోహిత్‌రాజు పర్యవేక్షించారు. వేడుకలకు రాష్ట్ర వ్యవసాయ, చేనేత, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూశాఖ మంత్రి సతీమణి మాధురిరెడ్డి, మహాబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, భధ్రాచలం, పినపాక, ఇల్లెందు శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, వికారభాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహూల్, అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ దంపతులు, ఏఎస్పీ విక్రాంత్‌సింగ్, డీఎసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, దేవస్థానం ఈ ఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.