calender_icon.png 27 October, 2024 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉదారతను చాటిన వైద్యుడు

27-10-2024 12:14:37 AM

పేద బాలుడికి ఉచిత వైద్యం

జనగామ, అక్టోబర్ 26 (విజయక్రాంతి): నిరుపేద కుటుంబానికి చెందిన ఓ బాలుడికి ఉచితంగా వైద్యం చేసి ఓ వైద్యుడు ప్రాణాలు నిలిపారు. రూ.3.50 లక్షల విలువైన వైద్యాన్ని నయాపైసా తీసుకోకుండానే చేసి ఉదారతను చాటుకున్నారు. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన సంధ్యా దంపతులకు 1౪ నెలల బాబు మస్తా సుహాస్ ప్రిన్స్‌కు కిడ్నీలో 18 మిల్లీమీటర్ల సైజు రాయితో బాధపడుతున్నాడు.

రాయిని తొలగించకుంటే కిడ్నీకి రంధ్రం ఏర్పడి బాబు ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని వైద్యులు చెప్పారు. ఇందుకోసం ఐదారు హాస్పిటల్స్ తిరిగిన తల్లిదండ్రులు చికిత్స కోసం రూ.4 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిసి బాధపడ్డారు. నిరుపేద కుటుంబం కావడంతో ఏమీ చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నారు.

ఈ విషయం తెలుసుకున్న హనుమకొండలోని శ్రీ శ్రీనివాస కిడ్నీ సెంటర్ యూరాలజిస్ట్ డాక్టర్ రాంప్రసాద్‌రెడ్డి వారిని చేరదీశారు. అత్యాధునికమైన లేజర్ చికిత్సతో బాబు కిడ్నీలోని రాయిని తొలగించారు. రూ.3 లక్షల 50 వేల విలువైన చికిత్సను ఉచితంగా చేయడంపై బాబు తల్లిదండ్రులు డాక్టర్ రాంప్రసాద్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.