22-04-2025 12:00:00 AM
కరీంనగర్, ఏప్రిల్ 21 (విజయ క్రాంతి): వాణిజ్య పన్నుల శాఖ రిటైడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నగరంలోని ఒక హోటల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 50 ఏళ్ల నుంచి పనిచేస్తున్నవారితోపాటు ప్రస్తుతం పనిచేస్తున్నవారు ఒక చోట కలుసుకున్నారు.
దీనికి కరీంనగర్ ఏసీటీవో మాదాటి జగన్ మోహన్ రెడ్డి సంపూర్ణ సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు రామస్వామి, కార్యదర్శి ఆర్ శ్రీనివాస్, జగన్ మోహన్ రెడ్డి, నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.