కరీంనగర్ సిటీ, జనవరి 5: చిన్న నీటిపారుదల శాఖ ఉమ్మడి కరీంనగర్ జిల్లా విశ్రాంత ఉద్యో గుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం రేకుర్తిలోని మహాలక్ష్మి పంక్షన్ హాలులో ఘనంగా జరిగింది. రిటైర్డ్ జూనియర్ అసిస్టెంట్ ఎన్. రాజారెడ్డి అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో రిటైర్డ్ ఈఎన్‌సి, సిఈలు కే.కృష్ణమూర్తి, నల్ల వెంకటేశ్వర్లు, డి. తులసీదాస్, టీ ఆర్ ఎస్.గుప్తా, విశ్రాంత ఇంజనీర్లు, విజయరాజ్, కే.సురేష్ బాబు, ఎం ఎ. రషీద్, ఎస్. రాజమల్లయ్య, బి. వెంకటయ్య, ఏ. రాజలింగం, విశ్రాంత పర్యవేక్షకులు ఎం. బాలకిషన్ రావు, మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు.