calender_icon.png 26 December, 2024 | 6:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి మెడలో ఉల్లిపాయల దండ

25-12-2024 02:45:50 AM

మహారాష్ట్రలో రైతు వినూత్న నిరసన

ఉల్లి ధరల పతనం, ఎగుమతి సుంకం 20 శాతం విధించడంపై ఆగ్రహం

ముంబై, డిసెంబర్ 24: మహారాష్ట్ర మత్స్యశాఖ మంత్రికి సభావేదికపై చేదు అనుభవం ఎదురైంది. అందరూ చూస్తుండగానే జనం మధ్య నుంచి ఒక రైతు వేదికపైకి వచ్చి మంత్రి మెడలో ఉల్లిపాయల దండ వేసి నిరసన వ్యక్తం చేశాడు.

నాసిక్ జిల్లాలోని చిరాయ్ గ్రామంలో సోమవారం సంత్ నివృత్తినాథ్ మహారాజ్ పాదుక దర్శన కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా మత్స్యశాఖ  మంత్రి నితీశ్ రాణే హాజరై సభావేదికపై ప్రసంగిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ రైతు సరాసరి వేదికపైకి వచ్చి మంత్రి మెడ లో ఉల్లిపాయల దండ వేశాడు. అనంతరం సదరు రైతు మైక్ వద్దకు వెళ్లి మాట్లాడేందుకు యత్నించగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

మహారాష్ట్రలో ఉల్లి ధరలు భారీగా పడిపోయాయి. దీంతో రైతు లు నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మరోవైపు ప్రభుత్వం ఉల్లి రైతుల నుంచి 20శాతం ఎగుమతి సుంకం విధిస్తున్నది. ధరలను స్థిరీకరిం చడంలోనూ విఫలమైంది. దీంతో రైతాంగం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. చిరాయ్ గ్రామానికి చెందిన రైతు కూడా మం త్రి మెడలో ఉల్లిపాయల దండ వేసి వినూత్నంగా నిరసన తెలిపాడు.