20-02-2025 04:41:45 PM
అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను చేదించిన సంగారెడ్డి జిల్లా పోలీసులు..
పోలీసుల అదుపులో ఆరుగురు నేరస్తులు..
మారుతి సుజుకి ఫ్రోనెక్స్ కార్, 6-సెల్ ఫోన్లు సీజ్.
సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేష్..
సంగారెడ్డి (విజయక్రాంతి): ఫార్మా కంపెనీలలో పెల్లాడియం దొంగతనానికి పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశామని సంగారెడ్డి ఎస్పీ చెన్నూరు రూపేష్ తెలిపారు. గురువారం సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. సదాశివపేట పోలీసు స్టేషన్ పరిదిలో యావాపూర్ గ్రామంలో గల అరీన్ లైఫ్ సైన్సెస్ యూనిట్-3 కంపెనీలో జరిగిన పల్లాడియం కార్బన్ దొంగతనంపై అరీన్ లైఫ్ సైన్సెస్ సీనియర్ హెచ్ ఆర్ మేనేజర్ మజ్జి సూరప్పల నాయుడు ఈ నెల 9నా ఫిర్యాదు చేశారని తెలిపారు. సంగారెడ్డి జిల్లా సిసియస్, సదాశివపేట పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, దర్యాప్తు ప్రారంభించామన్నారు. నూతన సాంకేతికత, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా బుధవారం మద్దికుంట చౌరస్తాలో ఆరుగురు నేరస్థులను పట్టుకొని, వారి వద్ద నుండి దొంగిలించబడిన 96 కిలోలా పల్లాడియం కార్బన్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు.
అల్లం సాంబశివుడు(43) ప్రైవేట్ ఉద్యోగి మసీద్‌పురం గ్రామం, మహానంది మండల్, నంద్యాల(జిల్లా) ఏపీ, ప్రస్తుతం హైదరాబాద్‌లోని సూరారంలో నివాసం ఉంటున్నారని తెలిపారు. ప్రసాద్ సాహెబ్ షిటోలే (24) దేవల్గవ్గడ గ్రామం, దౌండ(తాలూకా), పూణే, జిల్లా మహారాష్ట్ర, ఆదిత్య అంకుష్ మన్నె (23) అవన్ నగర్, పటాస్ గ్రామం, దౌండ్ తాలుక, పూణే జిల్లా మహారాష్ట్ర, తమ్మ ముక్కంటి రెడ్డి (47) అరేన్ లైఫ్ సైన్సెస్ (యూనిట్-3) ప్రైవేట్ లిమిటెడ్‌లో సీనియర్ మేనేజర్ స్టోర్‌లో ఉన్నారని తెలిపారు. శ్రీ సాయి కుటీర్, లక్ష్మారెడ్డిపాలెం, హయత్ నగర్, హైదరాబాద్, మట్టా కుటుంబ రావు (46) తాండవపల్లి గ్రామం, అమలాపురం మండలం, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏపీ ఇప్పుడు వాణి నగర్, చింతల్, హైదరాబాద్ నివాసం ఉంటున్నారని తెలిపారు. గుమ్మడి శ్రీనివాస్ రావు కెమికల్ వ్యాపార వ్యాపారం, కొల్కలూరు గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా ఏపీ, ప్రస్తుతం ప్లాట్ నెం. 302, దీపికా రెసిడెన్సీ, గాజులరామారం, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా ఉంటున్నారని వివరించారు.
సాంబశివుడు వివిధ ఫార్మా కంపెనీలో పని చేయడం వలన అతనికి పల్లాడియం కార్బన్ యొక్క విలువ గురించి పూర్తి అవగాహన ఉందన్నారు. అనుభవం ఉండడంతో తప్పుడు మార్గంలో అక్రమంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశ్యంతో గతంలో అతను పూణేలో ఫార్మా కంపెనీలో పనిచేసేటప్పుడు అక్కడ అతనితో పని చేస్తున్నా ప్రసాద్, అన్మోల్ జగ్గే @రాజుతో పరిచయం చేసుకొని, ఫార్మా కంపెనీలో పల్లాడియం కార్బన్ ను దొంగతనం చేసేందుకు ప్రోత్సహించాలన్నారు. ఫార్మా కంపెనీలలో దొంగతనం చేసిన పెల్లాడియం అమ్మగా వచ్చిన డబ్బులను సమానంగా పంచుకుందాం అని చెప్పి, సాంబశివుడు పూణేలో పని మానేసి తిరిగి హైదరాబాద్ వచ్చి పల్లాడియం కార్బన్ లభించే ఫార్మా కంపెనీల గురించి తెలుసుకుంటూ అక్కడ పనిచేస్తున్న స్టోర్ సిబ్బందికి డబ్బులు ఆశ చూపెట్టి అట్టి కంపెనీ యొక్క మెటీరియల్ గురించి పూర్తి సమాచారం తీసుకొని ప్రసాద్ టీం, అమోల్ జాగడే టీంకు తెలియజేస్తుండేవాడు అన్నారు.
2023లో సాంబశివుడు అమోల్ జాగడే @రాజు, ముఠా సభ్యులు గుమ్మడిదల పోలీసు స్టేషన్, బొంతపల్లిలో గల న్యూల్యాండ్ కంపెనీలో 35 కేజీల పల్లాడియం కార్బన్ దొంగతనం చేసినట్టు తెలిపారు. 2024 నవంబర్ లో అమోల్ జాగడే @ రాజు గ్యాంగ్ బొల్లారంలో గల రాంప్యాక్స్ కంపెనీలో 8 కిలోల పల్లాడియం కార్బన్ దొంగతనం చేశాడని వివరించారు. 2024 డిసెంబర్ లో ప్రసాద్ గ్యాంగ్ సభ్యులు బీదర్ లోని సాయి లైఫ్ సైన్సెస్ లో 15 నుండి 17 కిలోల కెమికల్ పౌడర్ దొంగతనం చేశారని తెలిపారు. 20 రోజుల క్రితం సాంబశివుడు సదాశివపేట పోలీసు స్టేషన్ పరిదిలో యావాపూర్ గ్రామంలో గల అరీన్ లైఫ్ సైన్సెస్ యూనిట్-3 గురించి తెలుసుకొని అతని ప్రణాళిక ప్రకారం ఇట్టి కంపెనీకి వచ్చి స్టోర్ మేనేజర్ ముక్కంటి రెడ్డి ని కలిసి అతనికి డబ్బుల ఆశ చూపి మెటీరియల్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకొని ప్రసాద్ కు చెప్పారని తెలిపారు.
ఈనెల 8న ప్రసాద్, అతని గ్యాంగ్ సభ్యులు సుమారు 120 కిలోలు పల్లాడియం కార్బన్ దొంగలించినట్లు విచారణలో తేలిందన్నారు. దీని విలువ రూ 4.5 కోట్లు ఉంటుందని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో ఉన్న పలు పరిశ్రమల, ఉద్యోగుల భద్రత దృష్ట్యా సెక్యూరిటీని పెంచాలని, సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగుల పూర్తి వివరాలను కలిగి ఉండాలని, గుర్తింపులేని, నేరాలకు పాల్పడిన వారిని ఉద్యోగులుగా తీసుకోరాదని అన్నారు. తమ కంపెనీలలో నిలువ ఉన్న సరుకును తరుచూ ఆడిట్ చేస్తూ అప్డేట్ గా ఉండాలని సూచించారు. కంపెనీ, ఉద్యోగుల భద్రతకు కట్టుబడి ఉండాలని సూచిస్తూ ఎలాంటి నేరాలు జరిగిన వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు.
ఈ కేసు చేదనలో కృషి చేసిన సదాశివపేట సీఐ మహేష్ గౌడ్, సిసియస్ సీఐ శివ కుమార్, కొండాపూర్ సీఐ డి.వెంకటేశ్, పి.రాము నాయుడు , ఎస్ఐ ఎస్ఐ శ్రీకాంత్, కొండాపూర్ ఎస్ఐ హరి శంకర్ గౌడ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి, రివార్డులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు, డీఎస్పీ సత్తయ్య గౌడ్ సీఐలు మహేష్ గౌడ్ , వి.శివకుమార్ , పి రాము నాయుడు సంగారెడ్డి సిసిఎస్ ఎస్ఐ కె.శ్రీకాంత్, సంగారెడ్డి, సదాశివపేట సిబ్బంది రామకృష్ణ, గణపతి రావు, వెంకటేశం, అమానుల్లా, వీరేశం, సిసిఎస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రెక్య, కానిస్టేబుళ్లు మతిన్, శశి, అన్వర్, సలీం, ప్రశాంత్, ఉదయ్ కిరణ్, మోహన్, సతీష్, ఆసిఫ్ పాల్గొన్నారు.