సంగారెడ్డి, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి)/ జహీరాబాద్: దారి దోపిడీకి పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసి.. వారి నుంచి బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని జహీరాబాద్ డీఎస్‌పీ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం న్యాల్‌క ల్ మండలంలోని హద్నూర్ పోలీసు స్టేషన్‌లో ఆయన కేసు వివరాలు వెల్లడించారు. ఈనెల 6న జహీరాబాద్ పట్టణంలోని శాంతినగర్‌కు చెం దిన సంగన్న (58) తన భార్య రుక్మిణితో కలిసి మోటారు సైకిల్ పై రేజింతల్‌లో ఉన్న బంధువుల ఇంటిలో జరిగే ఫంక్షన్‌కు వెళ్తుండగా.. మార్గమధ్యలో గుర్తుతెలియ ని దుండగులు రుక్మిణిపై దాడి చేసి ఆమె మెడలో ఉన్న బంగారు పుస్త్తెలతాడును గుంజుకొని పారిపోయారు.
6న బాధితులు హ ద్నూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యా దు చేశారు. ఈ క్రమంలో ఆదివారం సీఐ జుక్కల హన్మంత్, ఎస్‌ఐలు రామునాయుడు, నరేష్ తో పాటు, జహీరాబాద్ క్రైం టీం జైపాల్‌రెడ్డి, నర్సింహులు, అస్లాం రుక్మాపూర్ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆటోలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నిందితులు కర్ణా టకలోని బీదర్ జిల్లాకు చెందిన ప్రైవే ట్ ఉద్యోగి సయ్యద్ మహమ్మద్ (25), ఫార్మసీ విద్యార్థి షేక్ నధియాల్(22)గా పోలీసులు గుర్తించారు. వారినుంచి మూడున్నర తూలాల బంగారు పుస్తెల తాడు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.