మట్టి చరియలు విరిగిపడి 11 మంది మృతి
బీజింగ్, జూలై 28 : గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చైనాను వరదలు ముంచెత్తుతున్నా యి. భారీ వర్షాల కారణంగా ఆదివా రం చైనా ఆగ్నేయ ప్రాంతంలో మట్టిచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటన లో ఇప్పటివరకు 11 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది. హునన్ ప్రావిన్సులోని హెంగ్‌యాంగ్ నగర పరిధి యూలిన్ గ్రామంలోని ఓ ఇంటిపై ఆదివారం ఉదయం మట్టిచరియలు విరిగిపడ్డా యి. దీంట్లో 18 మంది చిక్కుకున్నట్లు తొలుత అధికారులు వెల్లడించారు. అనంతరం ఆరుగురిని రక్షించినట్లు తెలిపారు. మరొకరి ఆచూకీ లభించాల్సి ఉంది. భారీ వర్షాలతో పర్వతా ల పైనుంచి జాలువారుతున్న నీటి ప్రవాహం వల్ల మట్టిచరియలు విరిగిపడుతున్నాయని అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా చైనాలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ మరణాలు నమోదయ్యాయి.