calender_icon.png 29 November, 2024 | 10:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్రీజ్ అయిన అకౌంటును వెంటనే పునరుద్ధరించాలి

29-11-2024 07:39:56 PM

గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి 

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు (విజయక్రాంతి): గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పొరపాట్లు ఇప్పటికీ ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి అని ఫ్రిజ్ అయిన యాదవుల వ్యక్తిగత అకౌంట్లను తక్షణమే పునరుద్ధరించాలని జిల్లా కలెక్టర్ కు చరవాణిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంప్రదించారు. ఉప ఎన్నికలలో గత ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో భాగంగా గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించి వారి వ్యక్తిగత అకౌంట్లో నగదు జమ చేయడంతో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం వలన ఎన్నికల అధికారులు వారి అకౌంట్లో ఫీజింగ్లో ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. అప్పటినుండి ఇప్పటివరకు  ఫ్రిజ్ చేసిన ఎకౌంట్ లను రిలీజ్ చేయకపోవడంతో యాదవ సామాజిక వర్గం వారు ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ డబ్బులు, పత్తి కొనుగోలుకు సంబంధించిన డబ్బులు, ధాన్యం కొనుగోలుకు సంబంధించిన డబ్బులు  వ్యక్తిగత బ్యాంకు ఎకౌంటు ఫ్రీజ్ ఉండటం వల్ల జమ కాక శుక్రవారం మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం దేవత్ పల్లి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. స్పందించిన రాజ్ గోపాల్ రెడ్డి గారు వెంటనే నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఫ్రిజ్ చేసిన వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ లను రిలీజ్ చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ వెంటనే హామీ ఇవ్వడంతో రాజ్ గోపాల్ రెడ్డికి యాదవులు కృతజ్ఞతలు తెలిపారు.