01-03-2025 10:29:35 PM
గుర్తు చేసుకున్న మధురస్మతులు..
సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేటలో 35 సంవత్సరాల తర్వాత కలుసుకున్న బాల్య మిత్రుల ఆత్మీయతకు అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం వివిధ హోదాలతో పాటు వివిధ దేశాలలో అత్యున్నత స్థాయిలో స్థిరపడినప్పటికీ ఒరే, రారా, ఎమ్రా అంటూ చిన్నపిల్లల మాదిరిగా మనుసుతిరా మాట్లాడుకున్నారు. పాఠశాలలో చదువుకునే రోజుల్లో తాము చేసిన కొంటే, చిలిపి పనులను గుర్తు చేసుకుంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. బాల్య ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన వినోద్ మొదనిని తోటి మిత్రులు అభినందించారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి అమెరికా నుండి విచ్చేసిన గోపి సిరినేని, దేవేందర్ రెడ్డి, రాజేందర్, జ్ఞానేశ్వర్ సిద్దిపేటతో వున్న అనుబంధాన్ని, ఆప్యాయతలు పంచుకున్నారు.
తాము ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికి తమ పుట్టిన నేలను చూస్తే తమకు ఎంతో సంతోషం కలిగిందన్నారు. తామెంత సంపాదించినప్పటికీ కలగనీ సంతృప్తి తమ బాల్యమిత్రులను కలుసుకోవడంతో కలిగిందన్నారు. 1988 బ్యాచ్ ద్వారా సేవ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మిత్రబృందం వంశీధర్ రావు, సురేందర్, అశోక్, సిద్ధులు, పాండు, నరేందర్, ఫయాజ్, కొండల్, బి ఎల్ శీను, మోహిన్ బాబా, నర్సింగరావు, సత్యనారాయణ, ఆనంద్, ఉత్తంరావు, కనకయ్య, రాజ్ బహదూర్, రాజేష్, ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.