calender_icon.png 30 October, 2024 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్నేహితుడే.. కాబోయే వాడైతే!

24-10-2024 12:00:00 AM

ప్రస్తుతం జపాన్‌లో ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. ఆదేశంలో స్నేహితులను భాగస్వామ్యులుగా చేసుకునే సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అయితే ఈ ట్రెండ్ ఇండియాలోనూ ఉందంటున్నారు సైకాలజిస్టులు.

ఓ అబ్బాయికి పక్కంటి అమ్మాయితో పరిచయం ఏర్పడు తుంది. ఆ పరిచయం కాస్తా కొద్ది రోజుల్లోనే స్నేహంగా మారుతుంది. కాలేజీకి, సినిమాలకు కలిసివెళ్తారు. బాధలు, ఆనందాలు కలిసి షేర్ చేసుకుంటారు. ఇరువురి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే పాల్గొంటుంటారు. అలా ఫ్రెండ్స్ కాస్త ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోతారు. తెలియకుండానే ఇద్దరి మధ్య ఓ ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుంది.

అయితే అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెడతారు ఇంట్లోవాళ్లు. ఎన్ని సంబంధాలు వచ్చినా రిజెక్ట్ చేసి పెళ్లికి అయిష్టత చూపుతుంది. స్నేహితుడినే భాగస్వామిగా చేసుకోవాలనేది ఆమె కోరిక. చివరకు అమ్మాయి మనసును అర్థంచేసుకున్న కుటుంబ సభ్యులు చిన్ననాటి స్నేహితుడికి ఇచ్చి పెళ్లి జరిపిస్తారు.

ఈ నేపథ్యంపై ఎన్నో సినిమాలు వచ్చా యి. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూను ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌ను ఇష్టపడుతున్నారు చాలామంది. అందుకే జపాన్‌లో ఈ ట్రెండ్ బాగా ఫేమస్ అయ్యింది. 

2023లో జపాన్‌లో జనాభా సంఖ్య తగ్గింది. జనన రేట్లు తక్కువగా ఉన్నందున ఐదు మిలియన్లకు పడిపోయింది పెళ్లి రేటు కూడా తక్కువగానే ఉంది. 1930 తర్వాత తొలిసారిగా 2023లో పెళ్లిళ్ల సంఖ్య 5,00,000 కంటే దిగువకు పడిపోయింది. దాంతో అక్కడ స్నేహ వివాహాలు తెరపైకి వచ్చాయి. భాగస్వాములు చట్టబద్ధమైన జీవిత భాగస్వాములు అవుతారు.

కానీవారిలో బలమైన బంధం కొరవడి దాంపత్యం నిర్వీర్యమవుతున్న సందర్భాలున్నాయి. పిల్లలను కనడం కోసం కృత్రిమ గర్భధారణ, ఐవీఎఫ్‌ను ఆశ్రస్తూ ఇబ్బందుల పాలవుతున్నారు. అందుకే ‘ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్’ బెస్ట్ అని అని అంటోంది ఈతరం. ‘ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ అంటే మీ బెస్ట్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవడం లాంటి ది. ఒకే లక్ష్యాలు, ఆసక్తులుఉన్నవాళ్లు ఈ ట్రెండ్‌పై మొగ్గు చూపుతున్నారు.

ఇద్దరు కలిసి సమయాన్ని గడపడం, ఇంటి పనులు, ఆర్థిక బాధ్యతలను పంచుకోవడం, వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఒకరి ఎదుగుదలకు మరొకరు తోడ్పడటం దీని లక్ష్యం’ అని అంటున్నారు నిపుణులు. ‘జపాన్‌లోనే కాదు.. భారత దేశంలో ఈ ట్రెండ్ ఉందని, 2015 నుంచి ఇప్పటి వరకు దాదాపు 5000 పెళ్లిళ్లు జరిగాయని, వీరిలో కొందరు పిల్లలను పెంచుకుంటున్నారని , ‘ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్’ తో జంటలు ఆన్యోన్యంగా, ఆర్థికంగా బాగా ఉంటున్నారని పలు సర్వేలు తేల్చి చెప్పాయి కూడా. వివాహ వ్యవస్థకు స్నేహం బలమైన పునాది వేస్తుందని చాలా జంటలు భావిస్తున్నాయి. ‘స్నేహితుడిని వివాహం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. 

భాగస్వామ్య విలువలు, ఒకరి వ్యక్తిత్వాల గురించి లోతైన అవగాహన, శాంతియుత జీవనం, స్థిరమైన బంధం, గౌరవం లాంటివన్నీ దాంపత్యాన్ని బలోపేతం చేస్తున్నాయి’ అని చెప్పారు మాన సిక నిపుణులు. భారతదేశం కుటుంబ విలువలు లోతుగా పాతుకుపోయినప్పటికీ, రోజుకో కొత్త ట్రెండ్ పుట్టుకొస్తుంది. అందుకే ప్రస్తుతం స్నేహ వివాహాల ధోరణి పెరిగింది. ఇండియాలో ఇప్పుడు చాలా మంది పిల్లలు వద్దు.. ఫ్రెండ్       షిప్ మ్యారేజ్ కాన్సెఫ్ట్ ముద్దు అని అంటున్నారు.