తిరువనంతపురం, డిసెంబర్ 11: వాట్సాప్‌కు వచ్చిన నకిలీ లింక్ ఓపెన్ చేసి కేరళకు చెందిన ఓ వ్యక్తి రూ.4 కోట్లు పోగొట్టుకున్నాడు. త్రిపుణితరకు చెందిన 45 ఏళ్ల అవంతికాదేవ్ ప్రముఖ ఫైనాన్షియల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తన మొబైల్ వాట్సాప్‌కు సెప్టెంబర్ 26న యాప్ లింక్ వచ్చింది. దేవ్ ఆ లింక్ ఓపెన్ చేయగానే ‘బీఆర్ బ్లాక్ ప్రో’ యాప్ తెరుచుకుంది.
యాప్‌లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని రాసి ఉండడం చూసి దేవ్ పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు. తొలుత కొద్దిగా లాభాలు వచ్చాయి. దీంతో దేవ్ మరింత ఆశపడి మొత్తం రూ.4 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాడు. కొద్దిరోజులు యాప్ స్తబ్దుగా ఉండడాన్ని గమనించి, నగదు ఉపసంహరించుకోవాలని ప్రయత్నించాడు. ప్రయత్నాలు సాధ్యంకాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.