calender_icon.png 6 February, 2025 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కూల్ బస్సు కిందపడి నాలుగేళ్ల చిన్నారి మృతి

06-02-2025 04:36:51 PM

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా(Rangareddy District) పెద్దఅంబర్ పేట లో గురువారం ఘోర విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కిందపడి ఎల్కేజి(LKG) చదువుతున్నా నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సాయంత్రం స్కూల్ బస్సు దిగి వెళ్తుండగా బాలికను గమనించకుండా డ్రైవర్ రివర్స్ తీయడంతో చిన్నారి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకుని డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన చిన్నారిని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.