20-03-2025 10:18:09 PM
ఆల్ ది బెస్ట్ చెప్పిన వైరా వాణి విద్యాలయ పూర్వ విద్యార్థి..!
వైరా (విజయక్రాంతి): తాను చదివిన పాఠశాలపై ఓ పూర్వ విద్యార్థి తన అభిమానాన్ని చాటాడు.. ప్రస్తుతం 'పది' చదువుతూ.. శుక్రవారం ఫైనల్ పరీక్ష రాసే విద్యార్థిని విద్యార్థులకు మిఠాయిలు పంపి విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాలని పాఠశాల యాజమాన్యంను కోరడంతో.. గురువారం రాత్రి శ్రీ వాణి వివేకానంద విద్యాలయం నిర్వాహకులు చుండూరు కోటేశ్వరరావు, వాణితో పాటు ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థి ఆదిశేషు విద్యార్థులందరికీ అభిమానంతో స్వీట్లు పంపి ఆల్ ది బెస్ట్ చెప్పారని విద్యార్థులకు తెలిపారు..
ప్రత్యేకంగా సదరు విద్యార్థి ఆదిశేషు ఆల్ ది బెస్ట్ చెప్పటం వెనుక ఆంతర్యం ఏంటి?అనే విషయంపై అడుగగా.. ఆ విద్యార్థి 'పది'పరీక్షలు అంటే కొంచెం భయాందోళనకు గురి అయ్యేవాడని.. అతనికి ఎంతో ధైర్యం చెప్పామని.. ఉత్తమ మార్కులు సాధించాడని.. అటువంటి ఇబ్బంది ఎవరు పడకూడదని.. ఎటువంటి భయం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆకాంక్షిస్తూ.. గత అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. సూచనలు చేస్తూ.. ఇలా విషెస్ చెప్పడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ విషయం పరీక్ష రాసే విద్యార్థులందరినీ ఆలోచింపజేసింది.