calender_icon.png 18 January, 2025 | 10:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ వారం ఐపీవోల వెల్లువ

09-09-2024 12:00:00 AM

ప్రైమరీ మార్కెట్లోకి 13 కంపెనీల ఆఫర్లు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఈ వారం మార్కెట్లోకి ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు (ఐపీవోలు) వెల్లువెత్తుతున్నాయి. బజాజ్ హౌసింగ్ ఫైనా న్స్‌తో సహా నాలుగు మెయిన్‌బోర్డ్ ఆఫర్లు, మరో 8 ఎస్‌ఎంఈ ఆఫర్లు ఈ వారం ప్రైమ రీ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమ య్యాయి. ప్రధాన విభాగంలో ఐపీవోల ద్వా రా 4 కంపెనీలు రూ. 8,300 కోట్లకుపైగా సమీకరిస్తుండగా, 9 ఎస్‌ఎంఈ కంపెనీలు వాటి ఆఫర్ల ద్వారా రూ. 254 కోట్లు సేకరిం చనున్నాయి. ఈ మొత్తం 13 కంపెనీలు కలి పి రూ. 8,644 కోట్లు సమీకరించేందుకు చూస్తున్నాయి.

వచ్చే రెండు వారాలూ ఐపీ వో మార్కెట్ యాక్టివిటీ జోరుగా ఉంటుం దని ఈక్విరస్ మేనేజింగ్ డైరెక్టర్ మునీశ్ అగర్వాల్ చెప్పారు. మెయిన్‌బోర్డులో బజా జ్ హౌసింగ్ ఫైనాన్స్ రూ. 6,560 కోట్లు, పీఎన్‌జీ జ్యువెలర్స్ రూ. 1,100 కోట్లు, క్రాస్ లిమిటెడ్ రూ. 500 కోట్లు, టొలిన్స్ టైర్స్ రూ.230 కోట్లు సమీకరిస్తాయి. ఇందులో బజాజ్ హౌసింగ్, క్రాస్ లిమిటెడ్, టొలిన్ టైర్స్ ఐపీవోలు సెప్టెంబర్ 9న ప్రారంభమై సెప్టెంబర్ 11న ముగుస్తాయి. పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ సెప్టెంబర్ 10న ప్రారంభమై 12న ముగుస్తుంది. వీటికి తోడు మెయిన్‌బోర్డులో ఆర్కడే డెవలపర్స్ సెప్టెంబర్ 16న ఐపీవో జారీచేయనుంది. వెస్ట్రన్ క్యారియర్స్ ఇండి యా త్వరలో పబ్లిక్ ఇష్యూకు రానుంది. 

ఈ ఏడాది రూ.1.25 లక్షల కోట్ల ఆఫర్లు

ఈ ఏడాది ఇప్పటివరకూ 50 మెయిన్ బోర్డ్ ఐపీవోలు మార్కెట్ నుంచి నిధులు సమీకరించగా, వొడాఫోన్ ఐడియా ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో) జారీచేసింది. ఆగస్టు చివరినాటికి రూ. 80,000 కోట్ల నిధుల్ని మెయిన్‌బోర్డ్ ఐపీవోలు సమీకరిం చాయని, ఈ క్యాలండర్ సంవత్సరంలో ఈ మొత్తం రూ.1.25 లక్షల కోట్లకు చేరుతుం దని అంచనా వేస్తున్నట్టు ఈక్విరస్ అగర్వాల్ తెలిపారు.

సెకండరీ మార్కెట్ జోరు కొన సాగినంతకాలం ఐపీవోలతో ప్రైమరీ మార్కె ట్ బిజీగా ఉంటుందని మోజో పీఎంఎస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ సునీల్ దాల్మి యా తెలిపారు. ఇటీవలికాలంలో ఐపీవో లకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభిస్తు న్నది. ఆగస్టు నెలలో మెయిన్‌బోర్డు ఆఫర్లు సగటున 75 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ సగ టు సబ్‌స్క్రిప్షన్ 66 రెట్లు ఉన్నది.