calender_icon.png 27 December, 2024 | 7:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లెలకు నిధుల వరద!

27-12-2024 03:24:17 AM

రైతులు, మహిళలే లక్ష్యంగా సంక్షేమ పథకాలు  

  1. వచ్చే నెల మరికొన్ని పథకాలు 
  2. 25లక్షల మందికి రుణమాఫీ  
  3. మహిళాసంఘాలకు 20 వేల కోట్లు   
  4. 10వేల కోట్లతో రైతు భరోసా!

హైదరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): సంక్షేమ పథకాల అమలుతో గ్రామాల్లో ప్రభుత్వం నిధుల వరద పారిస్తోంది. పల్లెల్లో మెజార్టీగా ఉండే రైతుల ఆమ్దానీ పెంచేందుకు కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రూ.21 వేల కోట్ల రుణమాఫీని ప్రభుత్వం చేసింది. దీంతో దాదాపు 22 లక్షల మంది రైతులు పంటల సాగుకు కొత్త రుణాలను తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే ప్రభుత్వం రైతు భరోసా కింద రూ.7,600 కోట్లు విడుదల చేసింది. సంక్రాంతి నుంచి ఎకరానికి రూ.15 వేలు ఇచ్చే స్కీమ్‌ను ప్రారంభించనుంది. దీని కోసం దాదాపు రూ.10 వేల కోట్ల వరకు అవసరం అవుతాయి. ఇదే కాకుండా సన్నాలకు బోనస్ ఇస్తోంది. ఇప్పటి వరకు 18.78 లక్షల సన్న వడ్లను సర్కారు కొనుగోలు చేసింది.

వీటి కోసం ప్రభుత్వం బోనస్ కింద రూ.1000 కోట్లు ఇవ్వాల్సి ఉంది. దీని వల్ల ఏకంగా 3.36లక్షల మంది రైతులకు లబ్ధి జరుగుతుంది. ఇతర సబ్సిడీలు రైతులను ఆర్థికం గా మరింత పరిపుష్టం చేయనున్నా యి. రైతులకు నేరుగా నగదను చేరేవేసేలా తీసుకొచ్చిన ఈ పథకాలతో గ్రామాల్లో రైతులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. 

మహిళా సాధికారత దిశగా 

ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బ స్సు ప్రయాణం పథకం వల్ల పనిచేసే మ హిళలు పెరిగినట్టు నివేదికలు చెప్తున్నాయి. గతంలో ఇతర ప్రాంతాలకు వెళ్లి పనిచేస్తే.. వచ్చే కూలీ రాను, పోనూ చార్జీలకే సరిపోయేదని చాలామంది ఇంటి వద్దే ఉండేవా రు. మహాలక్ష్మిపథకం ద్వారా ఉచిత ప్రయా ణ సౌకర్యం రావడంతో పని చేసేందుకు ఇతర ప్రాంతాలకు బస్సుల్లో వెళ్తున్నారు.

ఫలితంగా పనిచేసే మహిళల సంఖ్య పెరిగింది. ఈ స్కీమ్ ద్వారా నేరుగా ప్రభుత్వం నగదు అందజేయకున్నా.. పరోక్షంగా సాయపడిం ది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్ రాయితీ లబ్ధిదారుల్లో మెజార్టీ సంఖ్య పల్లెల్లోనే ఉంటారు. ఈ స్కీమ్స్ కూ డా లబ్ధిదారులకు పరోక్షంగా అర్థికంగా లబ్ధి చేకూరుస్తున్నాయి.

గ్రామాల్లోని అతివలకు చేయూత అందించేందుకు స్కూల్ యూనిఫామ్స్‌లను కట్టే పనులను మహిళా సం ఘాలకు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని విద్యార్థులకు అవసరమైన 29 లక్షల డ్రెస్సులను మహిళలే కుట్టనున్నారు. తద్వా రా మహిళలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుం ది.

కుట్టు కూలీ చార్జీలను ప్రభుత్వం రూ.75 చెల్లించనుంది. ఇలా దాదాపు రూ.21 కోట్ల ను పొందనున్నారు. స్కూళ్ల నిర్వహణ కోసం మహిళల సారథ్యంలో అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసింది. దీని ద్వారా మహిళ లు ప్రత్యక్షంగా ఉపాధి పొందనున్నారు.

ఏడాదికి రూ.20వేల కోట్ల రుణాలు 

తెలంగాణలోని మహిళా స్వయం సంఘాలకు అర్థికంగా భరోసానిచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రమాళికతో ముందుకు సాగుతోంది. ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో ఏడాదికి రూ.20 వేల కోట్ల వడ్డీలేని రుణాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రుణాలు మహిళలను వ్యాపరపరంగా ముందుకు తీసుకెళ్తాయని సర్కారు భావిస్తోంది.

ఇప్పటికే ఈ ఏడాది రూ.1800 కోట్ల వడ్డీ రుణాలను ప్రభుత్వం స్వయం సహాయ సంఘం సభ్యులకు అందజేసింది. వచ్చే ఏడాది నుంచి ఏడాదికి రూ.20 వేల కోట్ల రుణాలను ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ అప్పులు మహిళలను ఆర్థికంగా పరిపుష్టం చేస్తాయని ప్రభుత్వం నమ్ముతోంది.

ఇందిరమ్మ ఇళ్లకు రూ.7,740కోట్లు

ఇందిరమ్మ లబ్ధిదారుల్లో మెజార్టీ లబ్ధిదారులు గ్రామాలకు చెందిన వారే. మొదటి విడత కింద 4.5 లక్షల ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పుడు సర్వే చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.7,740 కోట్లను ఖర్చు చేయనుంది. ఈ పథకం ద్వారా 4.5 లక్షల మందికి నేరుగా ప్రయోజనం దక్కుతుంది. ఇళ్ల నిర్మాణం ద్వారా వేలాది మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుంది.

ఇసుక, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇలా క్రయ విక్రయాలు భారీగా జరగనున్నాయి. ఫలితంగా నగదు రొటేషన్ భారీగా జరగనుంది. ఇవేకాకుండా కాంగ్రెస్ వచ్చేన ఏడాదిలో  చేయూత స్కీమ్ కింద రూ.11,382 కోట్లు, విద్యుత్ సబ్సిడీ కింద మరో రూ.11 వేల కోట్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీమ్ ద్వారా రూ.2,311 కోట్లను ఖర్చు చేసింది.

ఈ పథకాల్లో గ్రామీణ లబ్ధిదారులే అధికంగా ఉన్నారు. ముఖ్యంగా విద్యుత్ సబ్సిడీలో సింహభాగం రైతులకు వ్యవసాయానికి ఇస్తున్న కరెంట్‌దే కావడం గమనార్హం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఖర్చు చేసిన, త్వరలో ఖర్చు చేయబోతున్న మొత్తంలో పల్లెలకు దాదాపు రూ.లక్ష కోట్లు చేరొచ్చని అంచనా.