న్యూఢిల్లీ, నవంబర్ 13: ప్రభుత్వ రంగ అల్యూమినియం కంపెనీ నాల్కో నికరలాభం సెప్టెంబర్ త్రైమాసికంలో ఐదు రెట్లు పెరిగి రూ. 1,046 కోట్లకు చేరింది. నిరుడు క్యూ2లో నాల్కో రూ.187 కోట్ల లాభాన్ని ఆర్జించింది. కంపెనీ ఆదాయం రూ. 3,044 కోట్ల నుంచి రూ.4,002 కోట్లకు చేరింది. షేరుకు రూ.4 చొప్పున మధ్యంతర డివిడెండును బోర్డు సిఫార్సుచేసింది.