calender_icon.png 27 December, 2024 | 8:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంసన్ హైజెన్ కేర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

07-11-2024 12:40:50 AM

రంగారెడ్డి, నవంబర్ 6 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని హిమాలయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ (కంసన్) హైజెనిక్ పరిశ్రమలో బుధవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక షెడ్డులో భారీ మంటలు ఎగిసిపడి అందరూ చూస్తుండగానే పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. ఐదు ఫైర్‌ఇంజన్‌లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది.