మంటలార్పిన కుక్కునూరుపల్లి పోలీసులు
కొండపాక సెప్టెంబర్ 13: మెదినిపూర్ బస్టాప్ వద్ద్ద ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగటంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న క్రమంలో మెదినిపూర్ స్ట్టేజ్ వద్దకు రాగానే ఒక్కసారిగా బస్సు ఇంజన్ నుంచి మంటలు వెలువడ్డాయి. ప్రయాణికులు డయల్ 100కు సమాచారం ఇవ్వగా.. పోలీసులు సంగటనా స్థలానికి చేరకొని ప్రయాణికులను కిందకు దింపి నీళ్లతో ఇంజన్ నుంచి వస్తున్న మంటలను ఆర్పివేశారు. అయితే ప్రమాదంలో బస్సు కొంతమేర కాలిపోగా.. ప్రయాణికులకు ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. కాల్ వచ్చిన వెంటనే స్పందించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన కుక్కునూరుపల్లి పొలీసులను.. పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ అభినందించారు.