చౌటుప్పల్ వద్ద ఘటన
యాదాద్రి భువనగిరి, జనవరి 19 (విజయక్రాంతి): యాదాద్రి భువనగి రి జిల్లా చౌటుప్పల్ వద్ద విజయవాడ జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్ వైపు వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంట నే కారును ఆపడంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా దిగిపోయా రు.
ఏపీలోని గుడివాడకు చెందిన నాగశౌర్య తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం కారులో విజయవా డ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నాడు. కారు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంట లు చెలరేగడంతో ఈ సంఘటన జరిగింది. స్థానికులు మంటలను ఆర్పివే యడంతో ప్రమాదం తప్పింది.