15-02-2025 01:14:23 AM
డెహ్రాడూన్, ఫిబ్రవరి 14: పోలీస్ స్టేషన్లలో తప్పుడు ఫిర్యాదులు చేస్తే మూల్యం చెల్లించక తప్పదని ఉత్తరఖండ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజలను హెచ్చరించింది. ఉమ్మడి పౌర స్మృతిలోని చాప్టర్ 6. నిబంధన 20(సబ్‌సెక్షన్ 2) ప్రకారం తప్పుడు ఫిర్యాదులు చేసే వారికి జరిమానాలు విధించనున్నట్టు గురువారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
మొదటిసారి తప్పు చేస్తే మందలించి వదిలేయనున్నట్టు తెలిపింది. అదే తప్పు మరోసారి చేస్తే రూ.5వేల జరిమానా విధించిననున్నట్టు పేర్కొంది. మరోసారి తప్పును పునరావృతం చేస్తే రూ.10వేల జరిమానా విధించినున్నట్టు వివరించింది.
తప్పుడు ఫిర్యాదులు చేసిన వ్యక్తులు ఈ జరిమానాను 45 రోజుల్లోగా ప్రభుత్వ అకౌంట్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. తప్పుడు ఫిర్యాదులను కట్టడి చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.