09-04-2025 12:41:24 AM
పాడేమోసి అభిమానాన్ని చాటుకున్న మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
రేవల్లి, ఏప్రిల్ 8: బిఆర్‌ఎస్ రేవల్లి మండల పార్టీ అధ్యక్షులు,మాజీ సింగిల్ విండో అధ్యక్షులు,సీనియర్ నాయకులు రఘురామారావు అనారోగ్యం తో సోమవారం మృతి చెందగా ఆయన అంతిమ యాత్రలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మరో మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి, నాగం తిరుపతి రెడ్డి లతో కలిసి పాల్గొని పార్థివదేహానికి పూలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఈ సంద ర్బంగా వారు. మాట్లాడుతూ రఘురామారావు లేకపోవడం ఈ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా బీఆర్‌ఎస్ పార్టీకి, తీరనిలోటని సుదీర్ఘ రాజకీయ జీవితములో ఎప్పుడూ ప్రజల సమస్యలకోసం తపించేవారని ఏనా డు తన సొంత పనులకోసం రాజకీయాన్ని వాడుకోలేదని.
ఆయన కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుం దన్నారు,ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,సేనాపతి,జహంగీర్, వెంకట్, గోపాల్ రావు, రామా రావు, తదితరులు పాల్గొన్నారు.