అర్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్...
ముషీరాబాద్ (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కవాడిగూడ వాసి బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు రంగరాజు గౌడ్ (73) అంత్యక్రియలు శనివారం బన్సీలాల్‌పేటలోని స్మశానవాటికలో అశ్రునయనాల మద్య ముగిశాయి. బీజేపీ సీనియర్ నాయకుడు రంగరాజు గౌడ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్సీలు రాంచందర్ రావు, కాసాని జ్ఞానేశ్వర్, కవాడిగూడ, రాంనగర్ కార్పొరేటర్‌లు రచనశ్రీ, రవిచారి, మాజీ కార్పొరేటర్లు టి. రవీందర్, పి. ఇందిర, బీజేపీ నాయకులు జి. వెంకటేశ్, మహేందర్ బాబు, పరిమల్ కుమార్, సలంద్రి శ్రీనివాస్ యాదవ్, సలంద్రి దిలీప్ యాదవ్‌లతో పాటు పలు పార్టీలు నాయకులు హాజరై రంగరాజు గౌడ్ పార్థీవదేహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోసారు. అనంతరం శవయాత్రలో పాల్గొన్నారు. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన రంగరాజు గౌడ్ అంతిమయాత్రలో వందలాది మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజనై కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం బన్సీలాల్‌పేటలోని స్మశానవాటికలో రంగరాజు గౌడ్ ఛితికి ఆయన కుమారుడు సంపత్ నిప్పంటించారు. రంగరాజు గౌడ్ మృతితో కవాడిగూడ తాళ్లబస్తీలో విషాదఛాయలు నెలకొన్నాయి.