calender_icon.png 27 December, 2024 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల్యాన్ని సెలబ్రేట్ చేసుకునే సినిమా

25-12-2024 12:31:32 AM

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ టైటిల్ రోల్‌లో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఎపిక్ ఫాంటసీ అడ్వెంచర్ ‘బరోజ్ 3డీ’. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ మంగళవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు.

ఈ సమావేశంలో హీరో, డైరెక్టర్ మోహన్‌లాల్ మాట్లాడుతూ.. “బరోజ్’ త్రీడీ ఫిల్మ్. నేటివ్ త్రీడీలో తీసిన సినిమా. 40 ఏళ్లుగా ఈ ఫార్మెట్‌లో సినిమాను ఎవరూ ప్రయత్నించలేదు. ఇది చిల్డ్రన్ ఫ్రెండ్లీ ఫిల్మ్. పిల్లలు, పెద్దలు అందరూ చూడాల్సిన సినిమా. చాలా ప్రేమతో తీశాం. మనలోని బాల్యాన్ని సెలబ్రేట్ చేసుకునే సినిమా. ఇది ఫ్యామిలీ ఫిల్మ్. ప్రపంచం అంతా చూడదగ్గ సినిమా ఇది. సంతోష్ శివన్ లాంటి ఇండియన్ బెస్ట్ కెమెరామెన్ ఈ సినిమాకు పనిచేశారు.

ఫస్ట్ త్రీడీ ఫిల్మ్‌కు పనిచేసిన నా ఫ్రెండ్ రాజీవ్‌కుమార్ ఇందులో భాగమ య్యారు. బాల మేధావి లిడియన్ నాదస్వరం ఈ సినిమాకు పాటలు సమకూర్చారు. తనలోని అమాయకత్వం స్వచ్ఛమైన పాటలను అందించింది. బీజీఎం ప్రత్యేకంగా ఉంటుంది. మైత్రీ మూవీ మేకర్స్‌తో అసోసియేట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఈ సినిమాకు క్రియేటివ్ హెడ్‌గా పనిచేస్తున్న టీకే రాజీవ్‌కుమార్‌తోపాటు ముఖేశ్ మెహతా, నిర్మాత రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.