నందమూరి తారక రామారావు కథానాయకుణిగా తెరకె క్కిన సినిమాల్లో మంచి విజయం సాధించిన చిత్రం ‘చిక్కడు దొరకడు’. కథతోపాటు మంచి హాస్యం ఉండి చివరి వరకు వినోదభరితంగా సాగుతుందీ సినిమా. ఈ తెలుగు చిత్రం 1967 డిసెంబర్ 21 విడుదలైంది. ఈ సినిమాలో తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత, ఆంధ్రప్రదే శ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీఆర్‌లు నాయికానాయకులు.
అప్పటి తరం నాయకుల్లో అగ్రగణ్యులైన రామారావు, కాంతారావులు కలిసి నటించడంతో అత్యంత ప్రేక్షకాదరణ పొందిందీ చిత్రం. ఇంకా కృష్ణకుమారి, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, - మహారాజు, త్యాగరాజు, సత్య నారాయణ, బాలకృష్ణ ముఖ్య తారాగణంగా ఉన్న ఈ సినిమాకు చిత్రాను వాదం, దర్శకత్వం, బీ విఠలాచార్య. సం గీతం టీవీ రాజు. ఒక రాజు.. బావమరది వల్ల తన ఇద్దరు పిల్లలను పోగొట్టుకొని జైలు పాలవుతాడు.
రెండు వేర్వేరు వాతావరణం ఉన్న ప్రదేశాల్లో పెరిగిన పిల్లలు పెద్దయ్యాక విభిన్న స్థాయిలో ఉంటారు. ఒకరు దొంగగా, మరొకరు ధనవంతుడి బిడ్డగా పెరుగుతారు. వాళ్లిద్దరూ కలిసి తమ తల్లిదండ్రుల గురించి తెలుసుకొని రాజ్యాన్ని కాపాడుకుంటారు. ఈ సినిమాలో ఆరు పాటలున్నాయి. వాటిలో ఐదింటిని దీన్ని రాసింది సీ నారాయణ రెడ్డి. ‘కన్నెపిల్ల అనగానే అందరికి అలుసే కన్నుగీటి అయ్యో అయ్యో..’ అంటూ సాగే ఒక్క పాటకు మాత్రం సాహిత్యం వీటూరి వెంకటసత్య సూర్యనారాయణ మూర్తి అందించగా, సుశీల పాడారు.