calender_icon.png 27 December, 2024 | 12:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజమౌళితో సినిమా అవకాశం మిస్సయ్యా

09-11-2024 12:00:00 AM

స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కంగువ’. దర్శకుడు శివ దీన్ని తెరకెక్కిస్తున్నారు. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 14న రిలీజ్‌కు వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను పాన్ ఇండియా మూవీస్ చేసేందుకు స్ఫూర్తినిచ్చింది సూర్యనే. ఫిలింమేకర్స్ కంటే స్టోరీస్‌ను సెలెక్ట్ చేసుకుని జర్నీ చేస్తున్న అతని డెసిషన్‌ను గౌరవిస్తా.

అతనితో సినిమా చేసే అవకాశం నేను మిస్ అయ్యా’ అన్నారు. హీరో సూర్య మాట్లాడుతూ.. ‘జ్ఞానవేల్ రాజా ఫోన్‌లో రాజమౌళి ఫొటో స్క్రీన్ సేవర్‌గా ఉంటుంది. ఆయన ఆశీస్సులు రాజాకు ఉండాలి. రాజమౌళితో సినిమా చేసే అవకాశం ఓసారి మిస్ చేసుకున్నా. ఆ అవకాశం కోసం వేచి చూస్తున్నా.’ అన్నారు. ‘సూర్య కంప్లీట్ యాక్టర్. ఆయనపై మన ప్రేమ ఎప్పటికీ ఉంటుంది’ అని హీరో సిద్ధు జొన్నలగడ్డ అన్నారు. ‘సూర్యను చూస్తుంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనిపిస్తుంది’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు.

చిత్ర దర్శకుడు శివ, నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజాతోపాటు డైరెక్టర్ బోయపాటి శ్రీను, నిర్మాతలు అల్లు అరవింద్, నిర్మాత సురేశ్‌బాబు, దిల్ రాజు, చిత్రబృందం పాల్గొన్నారు.