మియాపూర్ పోలీస్ స్టేషన్ లో సినీ దర్శకుడి భార్య ఫిర్యాదు...
శేరిలింగంపల్లి (విజయక్రాంతి): తెలుగు సినీ దర్శకుడు అదృశ్యమైన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనంగా మారింది. మియాపూర్‌లో దర్శకుడు ఓం రమేష్ కృష్ణ (46) అదృశ్యం అయ్యాడు. ఫ్రెండ్స్ కాలనీలో ఓం రమేష్ కృష్ణ నివాసం ఉంటున్నారు. ఈనెల 4వ తారీఖు ఉదయం ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లారు. మళ్లీ తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన ఆయన కుటుంబ సభ్యులు అంతా వెతికారు. ఎక్కడా ఆయన ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో ఆయన భార్య శ్రీదేవి మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఈ విషయంపై ఫిర్యాదు చేసింది. తన భర్త కనిపించడం లేదంటూ ఫోలీసులకు ఫిర్యాదు చేయడంతో దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సినీ పరిశ్రమలో అతడితో కలిసి పని చేసిన వారిని, స్నేహితులను పోలీసులు విచారిస్తున్నారు. కావాలనే ఆయన వెళ్లిపోయారా..? లేదంటే మరేదైనా జరిగిందా..? అన్న విషయాలు తెలియాల్సి ఉంది.