ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘డ్రీమ్ క్యాచర్’. ఈ చిత్రాన్ని సీయెల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై దర్శకుడు సందీప్ కాకుల రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 3న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరో ప్రశాంత్ కృష్ణ మాట్లాడుతూ.. ‘సైకలాజికల్ థ్రిల్లర్‌గా సరికొత్త ఎక్సిపీరియన్స్ ఇస్తుందీ సినిమా. ట్రైలర్ చూశాక నేను అడివి శేష్, రానాలా ఉన్నానంటూ కామెంట్స్ వస్తున్నాయి. వాళ్లు గొప్ప యాక్టర్స్, సెల్ఫ్ మేడ్ స్టార్స్. అలాంటి టాలెంటెడ్ ప్యాషనేట్ యాక్టర్స్‌తో నన్ను పోల్చడం సంతోషంగా ఉంది’ అన్నారు. డైరెక్టర్ సందీప్ కాకుల మాట్లాడుతూ.. “సినిమా చేయాలనేది నా డ్రీమ్.
కలల మీద సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ ‘డ్రీమ్ క్యాచర్’ మూవీ మొదలైంది. కలల నేపథ్యంగా ఇలాంటి సినిమా ఇప్పటిదాకా తెలుగులో రాలేదని చెప్పగలను. గంటన్నర నిడివితో సినిమా ఉంటుంది. పాటలు, ఫైట్స్ ఉండవు. ఒక మంచి మూవీ చేస్తే ఎక్కడైనా ఆదరిస్తారని నమ్మాను” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటి అచ్యస సిన్హా, డీవోపీ ప్రణీత్ గౌతమ్ నందా, నటులు నాగరాజు, శ్రీనివాస్ రామిరెడ్డి, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.