calender_icon.png 18 January, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నాచెల్లెళ్ల మధ్య గొడవ

03-09-2024 04:18:15 AM

  1. ఇంటినుంచి వెళ్లిపోయిన చెల్లెలు 
  2. పురుగుమందు తాగి అన్న ఆత్మహత్య 
  3. మరుసటి రోజు చెరువులో చెల్లెలి మృతదేహం లభ్యం

గజ్వేల్/దౌల్తాబాద్, సెప్టెంబరు2: చిన్నవిషయమై రేగిన గొడవ కారణంగా చెల్లెలు చెరువులో పడి ఆత్మహత్య చేసుకోగా, అన్న పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకునాడు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండ లం ఇందుప్రియాల్‌గ్రామానికి చెందిన శ్యామల, కిష్ట య్య దంపతులకు మహే శ్, రాము, కల్యాణి సం తానం.  పెద్దకొడుకు మహేశ్ గజ్వేల్‌లో కూలీపని చేస్తూ జీవనం సాగిస్తుండగా, కల్యాణి (17), రాము (19)ఇంటివద్దే ఉంటున్నారు. కాగా ఆదివారం కల్యాణి, రాముల మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన కల్యాణి ఆదివారం మధ్యా హ్నం ఇంటినుంచి వెళ్లిపోయింది.

చాలా సేపటి వర కు చెల్లెలు ఇంటికి రాకపోవడంతో.. రాము  మనస్థాపానికి గురై పురుగుమందు తాగాడు.. హైదాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించారు. రాము అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కాగా సోమవారం ఉద యం ఇందుప్రియాల్ గ్రామ చెరువులో కల్యాణిడెడ్‌బాడీ లభించింది దౌల్తాబాద్ ఎస్‌ఐ శ్రీరాం ప్రేమ్‌దీప్.. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.