మహావికాస్ అఘాడీపై ప్రధాని మోదీ సెటైర్
ముంబై, నవంబర్ 8: డ్రైవర్ సీటును స్వాధీనం చేసుకునేందుకు మహావికాస్ అ‘గాడీ’ లీడర్ల మధ్య పోరు నడుస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యంగ్యాస్త్రాలు సంధిం చారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం ఎవరవుతారన్న విషయమై ప్రతిపక్ష కూటమిలో విభేదాలు కొనసాగుతున్నాయని వాపోయారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ధూలేలో జరిగిన ప్రచారసభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రాష్ట్రంఓల మహాయుతి కూటమి అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు.
కొందరు నాయకులు ప్రజల నుంచి దోచుకునేందుకే రాజకీయాల్లోకి వస్తారని..అలాంటివారే రాష్ట్రాభివృద్ధికి ఇబ్బందులు ఏర్పరుస్తారని తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు ఎంతో ప్రేమకలవారని.. ఏది అడిగినా మనస్ఫూర్తిగా ఇచ్చేస్తారని వ్యాఖ్యానించారు.