calender_icon.png 6 October, 2024 | 6:10 AM

తుంగతుర్తిలో ముదురుతున్న వర్గపోరు

06-10-2024 12:23:09 AM

రెండు వర్గాలుగా చీలిన కాంగ్రెస్ నేతలు

ఎమ్మెల్యే వర్సెస్ సీనియర్ నాయకులు.. 

శనివారం సమావేశానికి వెళ్లకుండా నేతల అరెస్టు

సూర్యాపేట, అక్టోబర్ 5 (విజయక్రాంతి): తుంగతుర్తి కాంగ్రెస్‌లో వర్గపోరు రోజురోజుకు తీవ్రమవుతోంది. గత కొన్ని రోజులుగా ఎమ్మె ల్యే వర్సెస్ పాత కాంగ్రెస్ నాయకులు అన్నట్లుగా నియోజకవర్గంలో రాజకీయాలు సాగు తున్నాయి. ఇందుకు తగ్గట్టుగా వారి మధ్య విభేదాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

గత కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యే పాల్గొన్న ఓ కార్యక్రమాన్ని అడ్డుకుని సొంత పార్టీ నాయకులే నిరసన తెలుపగా.. శనివారం నియోజక వర్గ  సీనియర్ నాయకులు, కార్యకర్తల సమావేశానికి డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ధరూరి యోగానందచార్యులు శుక్రవారం పిలుపునిచ్చారు. సమావేశం ఏర్పాట్లలో భాగంగా స్థాని క పోలీస్ స్టేషన్‌లో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు నాయకులు తెలుపుతున్నారు.

నియోజకవర్గ నాయకులు సమస్యల పరిష్కారం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు వెళ్లే విధానంపై సమావేశం నిర్వహించేందుకు సిద్ధం అయినట్లు వారు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి నుంచి జాజిరెడ్డిగూడెం మండల కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి నూతనకల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో జాజిరెడ్డిగూడెం మండల పార్టీ అద్యక్షుడు మోరపాక సత్యం, కాంగ్రెస్ విభాగ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు నర్సిం గ్ శ్రీను, ఇతర నాయకులు ఉన్నారు. సమావేశం నిర్వహించాలనుకున్న ఫంక్షన్‌హాల్‌కు సైతం పోలీసులు తాళం వేశారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు సమావేశం నిర్వహించడం ఇష్టలేకనే ఎమ్మెల్యే మందుల సామెల్ ఆదేశాల మేరకు పోలీసులు అరెస్ట్ చేశారని వారు అరోపిస్తున్నారు. 

ముదురుతున్న విభేదాలు

గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌లో కొనసాగిన మందుల సామేల్ కాంగ్రెస్ గూటికి చేరి టికెట్ దక్కించుకున్న విషయం తెలిసిందే. స్థానిక కాంగ్రెస్ నాయకుల అండతో విజయం సాధించారు. గెలిచి న తర్వాత గతంలో బీఆర్‌ఎస్‌లో ఉన్న నా యకులు కాంగ్రెస్‌కు వలసవచ్చారు.

ఇప్పు డు ఇదే కాంగ్రెస్‌లో విభేదాలకు కారణం అవుతున్నదనే విమర్శలు ఉన్నాయి. ఎన్నో ఏండ్లుగా పార్టీని నమ్ముకుని, పార్టీని కాపాడుతూ వచ్చిన సీనియర్ కాంగ్రెస్ నాయ కులను కాదని, వలసవాదులకు ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారని గత కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. 

అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం

సీనియర్ నాయకుల అణిచివేతపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని డీసీసీ వైస్ ప్రెసిడెంట్ యోగానందచార్యులు తెలిపారు. సొంతపార్టీలోనే అణిచివేత ధోరణి సాగుతుందని సీఎం, పీసీసీ దృష్టికి తీసుకుపోతా మన్నారు. నియోజకవర్గ కాంగ్రెస్‌లో స్థానిక పరిస్థితిల అంచనాకు సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు.