19-02-2025 12:22:31 AM
మంథని, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): ఉపాధి హామీ పనుల వద్ద ఫీల్డ్ అసిస్టెంట్ ఎక్కడ? అని కూలీల వెతుక్కునే పరిస్థితి వచ్చింది... ఉపాధి కూలీల వద్ద కానరాని ఫీ ల్డ్ అసిస్టెంట్లు... ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో అభాసు పాలవుతున్న ఉపాధి హామీ పథకం... ఆవేదన వ్యక్తం చేస్తున్న రోజు వారి కూలీలు.
మంథని మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు గ్రామాలలో కొనసాగుతున్న...పని ప్రదేశం లో తమకు కనీస సదుపాయాలు కరువ య్యాయని ఏక్లాస్ పూర్ ఉపాధి హామీ కూ లీలు వాపోయారు. గ్రామంలోని పెద్ద మ డుగు వద్ద ఉపాధి హామీ కూలీలు సుమారు 30 మంది మట్టి తీసే పనులు చేస్తున్నారు.
తాము ఇంటి నుంచే తాగునీళ్లు తెచ్చుకుం టున్నామని, పని ప్రదేశంలో టెంట్ గాని నీటి సౌకర్యం గాని ఫస్ట్ ఎయిడ్ కానీ లేవని, కూలీలు మోత్కూరి రాధమ్మ, గంధం వజ్ర మ్మ, నాతి రాజేశ్వరి, మోత్కూరి రమేష్, చిం తపండు మల్లమ్మ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వర కు పనులు చేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గిట్టుబాటు కూలి తమకు దక్కడం లేదని అవేధన వ్యక్తం చేశారు.
తమకు 15 రోజులకు ఒకసారి ఉపాధి హామీ కూలీ డ బ్బులు ఇవ్వాలని, ఏక్లాస్ పూర్ సబ్ స్టేషన్ నర్సరీ పక్కన పని చేస్తున్న నెల్లిపల్లి కి చెందిన మేకల జయమ్మతో పాటు ఇతర కూలీలు తెలిపారు. ఎక్లాస్పూర్ గ్రామపంచాయతీ పరిధిలో రెండు చోట్ల పనులు జరుగు తుండగా ఎక్కడ కూడా ఫీల్డ్ అసిస్టెంట్ జాడ అనిపించలేదు... కూలీలను అడిగితే ఇప్పుడే వచ్చి పోయాడని చెప్పారు తప్ప, ఫీల్డ్ అసి స్టెంట్ మాత్రం పని వద్ద అక్కడికి వెళ్లిన పాత్రికేయులకు మాత్రం కనిపించలేదు.
రెం డు చోట్ల పనులు జరగక ఇక్కడ కూలీలను అడిగితే అక్కడ ఉన్నాడని, ఇక్కడ ఉన్నాడని తెలిపారే తప్ప, ఎక్కడ ఉన్నాడో తెలియ రాలే దు. ఇలా నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకునే వారే కరువయ్యారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఉపాధి హామీ పథకం అభ సు పాలవుతుంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఉపాధి హామీ పనులపై ప్రత్యేక దృష్టి సారిం చాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు.