calender_icon.png 15 January, 2025 | 10:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండుగ కోలాహలం

25-10-2024 12:00:00 AM

పండుగ అనగానే వాకిట్లో ముగ్గులు.. మట్టి ప్రమిదలు.. టపాసుల శబ్దాలు.. భూచక్రాలు.. ఆకాశంలోకి రివ్వున ఎగిరే రాకెట్ బాం బులు.. కాకరవత్తుల మెరుపులు పండుగను మరింత రెట్టింపు చేస్తాయి.  ఇప్పటికే మార్కెంటంతా పండుగ కోలాహలంతో నిండిపోయింది. షాపింగ్ మాల్స్ నిండా మగువల సందడి.. ఎక్కడ చూసిన తోరణాలు.. బంతుపూల పరిమళాలు.. రంగు రంగుల మట్టి ప్రమిదలు దర్శనమిస్తాయి.

తోరణాలు..

పండుగ అనగానే దర్వాజకు వేలాడే ఆరిటాకు తోరణాలే గుర్తొస్తాయి. కానీ వీటికి భిన్నంగా మార్కెట్లో వివిధ రకాల డిజైన్లలో రంగుల్లో కొత్త సోయగాలను అద్దుకొని చాలా తోరణాలు వచ్చాయి. బంతిపూల తోరణాలు, చిన్నచిన్న ఎల్‌ఈడీ లైట్లతో తయారు చేసిన ఎలక్ట్రిక్ తోరణాలను యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు.  

ప్రమిదలకు సరికొత్త కళ

పండుగపూట ఎక్కడ చూసినా రంగురంగుల దీపాలు వెలుగులీనుతుంటాయి. మట్టి ప్రమిదల్లో నూనె పోసి వత్తులు వేసి వెలిగించే ఆ సంప్రదాయపు అందమే అద్భుతం. ప్రస్తుతం మార్కెట్‌లో సరికొత్త దీపాలూ వస్తున్నాయి.

ఎల్‌ఈడీ లైట్లు, నేతి దీపం, ఆరని మట్టి దీపం, ఎలక్ట్రిక్ దీపం, కలశ దీపం, నీటి దీపాలు అని చాలా రకాలు వచ్చాయి. ఎన్ని వచ్చినా.. మట్టితో తయారు చేసిన ప్రమిదలకు మాత్రం గిరాకీ ఎక్కువ. వీటినే కొనడానికి ఇష్టపడతారు మగువలు. మట్టి ప్రమిదలు ఇంటి కళను మరింత రెట్టింపు చేస్తాయి.