calender_icon.png 22 January, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భావోద్వేగాల ‘ఉత్సవం’

13-08-2024 12:00:00 AM

దిలీప్ ప్రకాశ్, రెజీనా కసాండ్రా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హార్న్‌బిల్ పిక్చర్స్ పతాకంపై సురేశ్ పాటిల్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్, పాటలు వంటి ప్రమోషనల్ కంటెంట్‌తో సినీ ప్రియుల్లో ఆసక్తి పెంపొందింపజేసిన మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. సెప్టెంబర్ 13న విడుదల కానున్న ఈ సినిమాను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు.

ప్రేమ, భావోద్వేగాలు, వినోదాల మేళవింపుతో కుటుంబ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్‌బీ శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. మాటలు: రమణ గోపిసెట్టి; గీత సాహిత్యం: వనమాలి, భాస్కరభట్ల, అనంత శ్రీరామ్; గాయకులు: అనురాగ్ కులకర్ణి, కైలాష్ ఖేర్, అర్మాన్ మాలిక్, విజయ్ ప్రకాశ్, పెంచల్ దాస్/రామ్ మిరియాల.