ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలో కనిపించిన దృశ్యం
పారిస్, జూలై 31: అట్టహాసంగా ఒలింపిక్స్ క్రీడల సంరంభం మొదలైంది. వేదికపై ఉన్న ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్‌ను క్రీడాశాఖ మంత్రి ఎమిలీ కాస్టెరా సరాసరి ఆలింగనం చేసుకుని గాఢంగా ముద్దుపెట్టారు. ఇది చూసిన ప్రధాని గాబ్రియల్ అట్టాల్ ఇబ్బందికరంగా స్పందిస్తూ ముఖం తిప్పుకొన్నాడు. ఫ్రాన్ రాజధాని పారిస్‌లోని సెన్ నది వేదికగా గతవారం జరిగిన వేడుకలో ఈ దృశ్యం కెమెరాలకు చిక్కింది. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయి అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్‌కు లేనిపోని తలనొప్పులు తెచ్చింది. ఉన్నతమైన హోదాలో ఉన్న అధ్యక్షుడు, క్రీడాశాఖ మంత్రి అనుచితంగా ప్రవర్తించారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ ఫ్రెంచ్ మ్యాగజైన్ కూడా ‘ఈ ముద్దు చాలా వింతగా ఉంది. బహుశా క్రీడాశాఖ మంత్రి ఎమిలీ కాస్టెరా అందరి దృష్టిని ఆకర్షించిందేందుకు ఆ పనిచేశారేమో’నని వ్యంగ్యంగా రాస్తూ చురకలంటించింది.