స్పష్టతనిచ్చిన భదత్రావర్గాలు
న్యూఢిల్లీ, నవంబర్ 29: ప్రధాని నరేంద్రమోదీ భద్రతా వలయంలో మహిళా కమాం డోలు సైతం ఉన్నారని చర్చ జరుగుతోంది. బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ షేర్ ఓ ఫొటోను షేర్ చేయడం ఇందుకు కారణం. పార్లమెంట్ పరిసరాల్లో ప్రధాని నడుస్తుండగా ఆయన వెనక ఓ మహిళా భద్రతా సిబ్బంది ఉన్న ఫొటోనే కంగన తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫొటో వైరలయ్యింది.
దీనికి కంగన ఎలాంటి క్యాప్షన్ రాయకపోవడంతో.. ఆమె ప్రధాని భద్రతా బృందం ఎస్పీజీ సభ్యురాలు అయి ఉండొచ్చని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా ఫొటో విషయమై భద్రతా వర్గాలు స్పందించాయి. కొందరు మహిళా ఎస్పీజీ కమాండోలు ‘క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్’లో సభ్యులుగా ఉన్నట్లు తెలిపాయి. అయితే ఈ ఫొటోలో ఉన్న మహిళ మాత్రం ఎస్పీజీ బృందంలో సభ్యురాలు కాదని స్పష్టం చేశాయి. ఆమె రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కేటాయించిన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అని పేర్కొన్నాయి.