26-02-2025 12:15:16 AM
బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ను ప్రకటించినప్పటి నుంచి సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘లడ్డు గానీ పెళ్లి’, ‘స్వాతి రెడ్డి’ పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది.
విడుదలైన నిమిషాల్లోనే ఈ టీజర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఒక్క టీజర్‌తోనే ఈ సినిమాలో కామెడీ లెవల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో మేకర్స్ చెప్పేశారు. కల్యాణ్ శంకర్ ఈ సీక్వెల్ తో మరోసారి నవ్వుల విందుని వడ్డించబోతున్నారని టీజర్‌తో అర్థమైంది.
మొదటి భాగంలో తమ అల్లరితో నవ్వులు పూయించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ (లడ్డు).. ‘మ్యాడ్ స్క్వేర్’లో అంతకుమించిన అల్లరి చేయబోతున్నారని తెలుస్తోంది. టీజర్‌లో వారి అల్లరి, పంచ్ డైలాగ్‌లు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. 2025, మార్చి 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.