calender_icon.png 12 February, 2025 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం మత్తులో కుమారుడిని చంపిన తండ్రి

09-02-2025 05:27:33 PM

యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం(Choutuppal Mandal) ఆరెగూడెంలో ఆదివారం ఘోరవిషాదం చోటుచేసుకుంది. ఓ తండ్రి మద్యం మత్తులో కుమారుడిని కొట్టిచంపిన విషాదం గ్రామంలో కలకలం రేపుతుంది. తాను చదువుతున్నా పాఠశాలలో శనివారం ఫేర్ వెల్ పార్టీ(Farewell Party)కి హజరు అయినా విద్యార్థి భాను, రాత్రి ఇంటికి ఆలస్యంగా రావడంతో మద్యం మత్తులో ఉన్న తండ్రి సైదులు కొపంతో చావబాదాడు.

తండ్రి కొట్టిన దెబ్బలతో 9వ తరగతి విద్యార్థి భాను తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి వెళ్లడంతో, గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యలు వెల్లడించారు. మృతి చెందిన విద్యార్థి ని పోస్టుమార్టం లేకుండా ఖననం చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నం చేయడంతో, విషయం తెలుసుకున్నా పోలీసులు ఘటనస్థలికి చేరుకుని కుటుంబ సభ్యులకు సర్దిజెప్పరు. అనంతరం మృతదేహన్ని శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. మృతికి కారణమైన తండ్రి సైదులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.