పట్టాదారు పాస్ పుస్తకం కోసం విసిగివేసారిన రైతు
కామారెడ్డి, ఆగస్టు 12 (విజయక్రాంతి): పట్టాదారు పాస్ పుస్తకం అడిగితే రేపుమాపంటూ రెవెన్యూ అధికారులు ఇబ్బందు లకు గురి చేయడంతో విసుగుచెందిన ఓ రైతు సోమవారం తహశీల్దార్ కార్యాల యం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్‌గల్‌లో చోటుచేసుకుంది. మండలంలోని వడ్లం గ్రామానికి చెందిన రైతు అంజయ్య తన భూమికి సంబంధించిన పాస్ పుస్తకం కోసం రెవెన్యూ అధికా రుల చుట్టు తిరుగుతున్నాడు.
త్వరగా పని కావాలని తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న ఆరై పండరికి కొన్ని నెలల క్రితం పాస్ పుస్తకం కోసం రూ.20 వేలు అందజేశాడు. అయినా అంజయ్యకు పాస్ పుస్తకాన్ని రెవెన్యూ అధికారులు అందిచలేదు. రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగి వేసారిన అంజయ్య.. సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుండగా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే అక్కడ ఉన్న వారు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విచారణకు ఆదేశించారు.