05-03-2025 01:13:36 AM
కోనరావుపేట,మార్చి 4: సాగునీరు లేక పంట పొలాలన్నీఎండిపోతున్నాని రైతుల ఆందోళన బాట పట్టారు. రైతుల పక్షాన ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి మలకపేట రిజర్వాయర్ నుండి నీటిని మళ్లించకపోతే, రైతులతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించడంతో ప్రభుత్వం దిగి వచ్చింది.
ఎట్టకేలకు మంగళవారం బోయినపల్లి మండలం ఇడ్మనేరు నుండి కోనరావుపేట మండలం రిజర్వాయర్ కు 0.5 టిఎంసి నీరును పంపిన ద్వారా మళ్ళించింది. దీంతో కొద్దిరోజులుగా రైతులు ఆశగా ఎదురుచూస్తున్న కల నెరవేరింది.మిడ్ మానేర్ నుంచి మల్కపేట రిజర్వాయర్‌లోకి నీటి విడుదల ఏర్పాట్లు దగ్గర ఉండి సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చూశారు. ఈ నీరు మల్కపేట రిజర్వాయర్‌కు చేరుకున్న వెంటనే, దీని పరిధిలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని మైసమ్మ చెరువు, సింగసముద్రం చెరువులకు చేరనున్నాయి. నీటి విడుదల చేసినందుకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.