calender_icon.png 14 October, 2024 | 5:55 AM

రాజులు వాడిన ఫ్యాన్

14-10-2024 12:00:00 AM

అప్పట్లో రాజులు వాడిన వస్తువులు చాలా గొప్పవి గా, అందమైన డిజైన్లలో ఉండేవి. ఆ కాలంలో రాజులు అరుదైన వస్తువులను సేకరించి రాజ్యభవనంలో ఉంచుకునేవారు. చాలామందికి రాజ్యభవనం అనగానే రాజులు వాడిన ప్రతి వస్తువును చూడాలనే కోరిక పుడుతుంది. ఇప్పుడు రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి.. వాళ్ళ తాలుకు కట్టడాలు, వస్తువులు మాత్రం పదిలంగా ఉన్నాయి.

ఆనాటి వస్తువులు కాలంతో కనుమరుగు కాకుండా మ్యూజియంలలో భద్రపరిచారు అధికారులు. పై బొమ్మలోని ఫ్యాన్(పంకా) కొల్లాపూర్ సంస్థనంలో రాజులు ఉపయోగించిన వాటిలో ఒకటి. ఈ ఫ్యాన్ ఐరన్ తీగలతో అల్లిన పువ్వు మాదిరి కనిపిస్తుంది.