21-03-2025 12:00:00 AM
హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): తెలంగాణలో ఉద్యోగాల జాతర నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలల్లోనే 58,868 ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించింది. త్వరలోనే గ్రూప్ 1, 2, 3 కలిపి 2,711 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అం దించనుంది. 14, 236 అంగన్వాడీ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసేం దుకు చర్యలు చేపట్టింది.
దీనితో పాటు 10,954 గ్రామ పాలనా అధికారుల నియామకాలను చేపట్టనుంది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఏళ్లుగా కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం బాసటగా నిలిచింది. రవీంద్రభారతిలో గురు వారం 922 మందికి సీఎం రేవంత్ నియామక పత్రాలు అందించగా.. వీరిలో 582 కారుణ్య నియామకాలు ఉన్నాయి.