calender_icon.png 17 October, 2024 | 5:05 AM

మాస్ డ్యాన్సుల జాతర

08-10-2024 12:00:00 AM

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నటిస్తున్న పీరియాడిక్ థ్రిల్లర్  సినిమా ‘క’. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మాత. త్వరలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం నుంచి ‘మాస్ జాతర’ సాంగ్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు.

సామ్ సీఎస్ స్వరాలు సమకూర్చగా, సనాపాటి భరద్వాజ పాత్రుడు సాహిత్యం అందించారు. దివాకర్, సామ్ సీఎస్, అభిషేక్ ఏఆర్ పాడారు. ఈ పాటలో హీరో కిరణ్ మాస్ ఎనర్జిటిక్స్ స్టెప్స్ ఆకట్టుకుంటాయి. హీరోయిన్లు సైతం అదిరే డ్యాన్సులు వేశారు. డీవోపీ: విశ్వాస్ డానియేల్, సతీశ్‌రెడ్డి మాసం.