calender_icon.png 31 October, 2024 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూల్‌లో మునిగిపోయిన స్విమ్మర్

03-08-2024 01:44:07 AM

పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా స్విమ్మింగ్ పోటీల్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుం ది.  స్లొవేకియాకు చెందిన స్విమ్మర్ టమర పొటొక మహిళల 200 మీటర్ల వ్యక్తిగత ఈవెంట్‌లో పాల్గొంది. క్వాలిఫికేషన్ రౌండ్ లో పొటొక ఏడో స్థానంలో నిలిచింది. అయి తే హీట్ ముగిసిన అనంతరం అక్కడే నిల్చొని ఉన్న తన కోచ్, ఇతరులకు నవ్వుతూ అభివాదం చేసింది. ఆ వెంటనే అస్వస్థతకు గురైన పొటొక పూల్‌లో మునిగిపోయింది. ఇది గమనించిన సిబ్బంది ఆమెను బయటికి తీసి స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న పొటొక బాగానే ఉన్నట్లు స్లొవేకి యా ఒలింపిక్ టీమ్ ప్రకటించింది.