calender_icon.png 29 March, 2025 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నడిచే కలవా.. ఎగిరే అలవా..

25-03-2025 12:00:00 AM

నాని హీరోగా నటిస్తున్న క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్3: ది థర్డ్ కేస్’. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా, నాని యూనిమస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌గా ‘ప్రేమ వెల్లువ’ అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది.

ఈ పాట భావోద్వేగ ఝరిలా సాగుతూ నాయకానాయికల అందమైన ప్రేమ ప్రయాణాన్ని ప్రదర్శస్తోంది. ‘దూకే నాపై ఇలా.. ఇవ్వాళే యే యే.. ప్రేమ వెల్లువా..’ అంటూ ప్రారంభమైన ఈ మెలోడీ ఆద్యంతం వినసొంపుగా ఉంది. ‘పగలే నా వైపుకి నడిచే కలవా.. పడుతూ యెగిరే అలవా..’ అంటూ సాగుతున్న ఈ పాటలో నాని, శ్రీనిధిశెట్టిల కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది.

కృష్ణకాంత్ కలం నుంచి జాలువారిన ఈ కవితాత్మక గీతాన్ని మిక్కీ జే మేయర్ సంగీత సారథ్యంలో సిద్ శ్రీరామ్ ఆలపించారు. మే 1న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి డీవోపీ: సాను జాన్ వర్గీస్; ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్.