calender_icon.png 21 February, 2025 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దశాబ్దాల కల నెరవేరింది

21-02-2025 01:10:50 AM

ఈ గెలుపు ప్రజల గెలుపు 

ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి 

గద్వాల, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండలం కేంద్రంలో ఎన్నో ఏళ్ళుగా దశాబ్దాల కాలం నుంచి మల్డకల్ మండల బస్టాండ్ స్థలం ఎన్నో రోజులుగా కోర్టులో ఉండడంతో బుధవారం న్యాయస్థానంలో ప్రభుత్వ స్థలమైన వాటికి న్యాయం స్థానంలో ప్రజల ఆస్తిగా గుర్తించి బస్టాండ్ తీర్పు రావడంతో న్యాయం గెలిచిందని ఈ గెలుపు ప్రజల గెలుపు అని   ఎమ్మెల్యే  బండ్ల కృష్ణమోహన్ రెడ్డి  అన్నారు. గురువారం మల్డకల్ ప్రజలకు పెద్ద ఎత్తున  ఎమ్మెల్యే కు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్బంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ మల్డకల్ మండలం గ్రా మంలో బస్టాండ్ స్థలమును కొంతమంది కబ్జా కోరలు కబ్జా చేయడం తో న్యాయస్థానానికి  ఆశ్రయించిన ప్రజలకు  బుధవారం న్యాయస్థానంలో న్యాయమైన తీర్పు రావడంతో ప్రజలందరికీ దశాబ్దాల కల సాకారం కావడం జరిగిందన్నారు. మల్డకల్  గ్రామా ల్లో స్వయంభు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండడం వల్ల ఎంతో ప్రత్యేకత ఉందని . ప్రతి సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.

వివిధ ప్రాంతాల నుండి ప్రజలు భక్తులు వచ్చి తమ మొక్కలను చెల్లించుకొని వెళ్తారు. కాబట్టి  బస్టాండ్ ను ఉండడం వల్ల గ్రామంలో నూతన షాపింగ్ మాల్ కూడా ఏర్పాటు కావడం జరిగిందన్నారు. భవిష్యత్తులో మండల అభివృద్ధి కొరకు నా వంతు సాయి శక్తుల కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పటేల్ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాజారెడ్డి మాజీ జడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వీరన్న,  సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి సత్యం రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ప్రహ్లాద రావు,  నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు పాల్గొన్నారు.