నిజామాబాద్ జిల్లా బోధన్‌లో దారుణం
నిజామాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో పది నెలల శిశువును కుక్క పీకుతున్నది. తన కొడు కు కిడ్నాప్ అయ్యాడని ఓ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన బయటపడింది. బోధన్ సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ బస్టాండ్‌లో ఓ త ల్లి తన కొడుకు(10నెలలు)ను ఫ్లాట్‌ఫారంపై వదిలి బాత్రూంకు వెళ్లింది. తిరిగి వచ్చేలోగా అక్కడే ఉన్న వీధి కుక్క శిశువును నోట కరచుకొని పో యి పీక్కుతిన్నది. ఈ విషయం తెలియని తల్లి తన శిశువు కిడ్నాప్ అ య్యాడని పోలీసులకు ఫిర్యాదు చేసి ంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మంగళవారం శిశువు శరీర భాగాలు బస్ డిపో ప్రాంతంలో లభించడంతో అసలు విషయం బయటపడింది.