29-04-2025 12:24:29 AM
గజ్వేల్ ఏప్రిల్ 28: సమాజంలో అత్యంత ఆధరణ కలిగిన వైద్య విద్యకు మంచి భవిష్యత్తు ఉండగా, ప్రపంచంలో మరణం లేనిది విద్యా, వైద్యం మాత్రమేనని కాళోజి నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి డాక్టర్లకు సూచించారు.
సిద్దిపేట జిల్లా లక్ష్మక్క పల్లి ఆర్విఎం మెడికల్ కళాశాలలో చైర్మన్ డాక్టర్ యాకయ్య అధ్యక్షతన జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై వైద్య విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో గ్రామీణ పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం లక్ష్యంగా దృష్టి పెట్టాలని సూచించారు.
ముఖ్యంగా రోగుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చక్కటి సేవలందిస్తే సమాజంలో గౌరవం గుర్తింపు దక్కుతుందని పేర్కొన్నారు. ఉన్నత లక్ష్యంతో పనిచేస్తున్న ఆర్వీఎం ట్రస్టు ప్రజలకు చక్కని వైద్య సేవలు అందిస్తూ ప్రజా వైద్యశాలగా గుర్తింపు తెచ్చుకుంటూ కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తుందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు మేనేజింగ్ డైరెక్టర్, మాజీ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, సీఈఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.